కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. అయితే ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ విద్యామంత్రి సబితారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులతో ఆమె చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామన్నారు. అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు.
Must Read : హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన మాజీ మంత్రి దేవినేని











