టాలీవుడ్ లో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ మూవీతో హీరోయిన్ గా లక్ష్మీ రాయ్ అడుగు పెట్టింది. తొలి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాలేదు. సౌత్ మొత్తం మీద కూడా హీరోయిన్ గా ఆమె గుర్తింపు తెచ్చు కోలేకపోయింది. దాంతో రాయ్ లక్ష్మి అని పేరు ఉల్టాగా మార్చుకొని ఐటెమ్ గాళ్ అవతార మెత్తింది. అందాల ఆరబోత షురూ చూసి.. అందులో బాగానే ఆరితేరింది. పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో తోబ తోబ , చిరు ‘ఖైదీ నెం. 150’ లో రత్తాలు రత్తాలు లాంటి పాటల్లో అందంగా చిందేసింది.
ఈలోగా .. రాయ్ లక్ష్మి దృష్టి బాలీవుడ్ పై పడింది. అక్కడ ‘జూలీ 2 సినిమాలోనూ, పాయిజన్’ లాంటి వెబ్ సిరీస్ లోనూ పేరు తెచ్చుకొని ప్రయత్నాలు సాగించింది. కానీ అక్కడ కూడా అమ్మడికి కలిసి రాలేదు. అందుకేనేమో ఈ మధ్య సీనియర్ హీరోల సినిమాల్లో సైతం హీరోయిన్ గా నటించేందుకే సిద్ధమే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుతం అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో నూ పలు చిత్రాల్లో నటిస్తోంది రాయ్ లక్ష్మి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రత్తాలు .. మహేశ్ బాబు నటిస్తోన్న ‘సర్కారువారి పాట’లో ఒక ఐటెమ్ సాంగ్ లో నర్తించడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ పాటను పరశురామ్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నాడట. ఇలా తెలుగు ఐటెమ్ సాంగ్స్ లోనైనా నటించి.. తెలుగులో మళ్లీ పాపులరవ్వాలని రాయ్ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఈ బ్యూటికి ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- పవన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో శ్రీలంక బ్యూటీ