తమిళ స్టార్ హీరో కార్తి రీసెంట్ మూవీ సుల్తాన్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భాగ్యరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది. కానీ రెండు భాషల్లోనూ ఆశించిన స్థాయిలో మెప్పించ లేకపోయింది. తన తండ్రి ఊరికిచ్చిన మాటను .. ఆయన అనుచరులైన వంద మందితో ఎలా నెరవేర్చాడు.. అనే కథాంశం తో వచ్చిన ఈ సినిమాను పక్కా యాక్షన్ మోడ్ లో చిత్రీకరించాడు దర్శకుడు.
అయితే ఎందుకనో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. కార్తిక్ యాక్షన్, రష్మికా గ్లామర్ సినిమాకు అనుకున్నంతగా సక్సెస్ ను అందించ లేకపోయాయి. అయితే ఇప్పుడు ‘సుల్తాన్’ మూవీ .. ఓటీటీలో స్ట్రీమ్ అవడానికి రెడీ అయిపోయింది. ఆహాలో ‘సుల్తాన్’ తెలుగు వెర్షన్ విడుదల కానుండగా, డిస్నీ హాట్ స్టార్ లో తమిళ వెర్షన్ విడుదల కాబోతోంది. అయితే వేరు వేరు ఓటీటీలే అయినా.. ఈ రెండు సినిమాలు ఒకేసారి.. అంటే.. మే 2న స్ట్రీమింగ్ కానుండడం విశేషంగా మారింది. మరి సుల్తాన్ ఓటీటీలో అయినా ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో మెప్పిస్తాడో లేదో చూడాలి.
Must Read ;- సుల్తాన్ (రివ్యూ)











