రాజధాని వికేంద్రీకరణకు జగన్ సర్కారు తొందరపడుతోంది. ముందుకు అడుగులు పడకుండా న్యాయపరమైన చిక్కులపై ఆందోళన చెందుతోంది. స్టే వెకేట్ చేయించడానికి సుప్రీంలో పిటిషన్లు వేసి భంగపడింది. తాజాగా హైకోర్టు మరో మూడు వారాల దాకా ఎలాంటి ముందడుగు పడకుండా కేసు వాయిదా వేసింది. ఈనేపథ్యంలో నారా లోకేష్ జగన్ పై ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఇంత తొందరపాటు ఎందుకు? అంటూ ఆయన సెటైర్లు వేశారు.
జగన్‌రెడ్డి గారూ!అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న మీరు…లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలి.కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు,విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
కోవిడ్ వైరస్ భయం వల్ల ఓసారి, కోర్టుకి రావాలంటే 60 లక్షలవుతుందని మరోసారి, గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నాను రాలేనని,ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నాను కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపునివ్వాలని అడుగుతున్నారు.రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్ళు గడిపేశారు. 29 వేల మంది రైతుల సమస్య కేసు రోజుల్లో తేలిపోవాలా? మీ లక్ష కోట్ల దోపిడీ కేసేమో ఏళ్లుగా సాగాలా?
.@ysjagan గారూ! అమరావతిని చంపేందుకు త్వరగా కోర్టులో విచారణ పూర్తిచేయాలని అడుగుతున్న మీరు…లక్ష కోట్ల ప్రజాధనం దోచేసిన 11 కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేందుకు సహకరించాలి. కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు,(1/3) pic.twitter.com/SDCPehauvA
— Lokesh Nara (@naralokesh) August 27, 2020










