బెల్లీ డ్యాన్సుల బుల్లి జాన్వీ కపూర్ స్పీడు పెంచేసింది. నటి శ్రీదేవి కూతురు అయిన జాన్వీకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ‘రూహి’ సినిమాలో ఆమె నర్తించిన పాట వ్యూస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జాన్వీ స్పీడు అందాల ఆరబోతలోనూ కనిపిస్తోంది. ఆమె నటిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు పరాజయాలే ఎదురయ్యాయి. ఇప్పుడు తానేమిటో నిరూపించుకుంటోంది జాన్వీ.
పొట్టి డ్రెస్సులు ధరించి కుర్రకారును వెర్రెక్కిస్తోంది. ఆమెలోని ఆత్మ విశ్వాసం చూస్తుంటే తల్లి పేరును నిలబెట్టేలానే ఉంది. కురచ దుస్తుల్లో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తానని హింట్ ఇచ్చినట్లయింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కేవలం సినిమాల్లోనే కాకుండా బయటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే కురచ దుస్తుల్లో కనిపిస్తోంది. తన కోసం డిజైనర్లతో ప్రత్యేకంగా ఇలాంటి దుస్తులను తయారుచేయించుకుంటోందట. మరీ ఇలా బరితెగించడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు కూడా ఉన్నారు. ఈరోజుల్లో ఇలాంటి కామనే పట్టించుకోవద్దంటూ ఆమెను సమర్థిస్తున్న వారూ ఉన్నారు. కాబట్టి ఇలా రెచ్చిపోవడంలో తప్పేమీ లేదని అనుకోవాలేమో.
Must Read ;- డాటరాఫ్ అతిలోక సుందరి.. కేరాఫ్ మాల్దీవులు