ఆ నలుగురు అనే పదం ఇండస్ట్రీలో గత పదేళ్లుగా ఎక్కువుగా వినిపిస్తోంది. సినిమా చిత్రీకరణ, థియేటర్ ప్రొజక్షన్ డిజిటల్ గా మారినప్పట్టి నుంచి ఆ నలుగురి హవా మొదలైందని చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలు తెగ వాపోతుంటారు. ఎవరా నలుగురు అంటే ఎవ్వరూ కూడా బయటకి చెప్పరు. ఏ సినీ పత్రికలు కూడా వారి పేర్లు బయట పెట్టవు, వారి పేరు మీద ఆర్టికల్స్ వేసినా అందులో వారు పేర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకొని మరీ ప్రచురిస్తారు.
ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే, సినీజనాలు అనధికారికంగా ఎక్కువగా చెప్పే పేర్లు లిస్ట్ వేస్తే మాత్రం అందులో పలు మార్లు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, ఏషియన్ సునీల్ పేర్లు కనిపిస్తాయి. ఈ నలుగురు సినిమా డిజిటలైజ్ అయ్యే టైమ్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెజారిటీ థియేటర్లని లీజుకు తీసుకొని తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నారని ఎప్పటినుంచో ఓ వర్గం వాదిస్తోంది. ఇదే విషయమై ఈ నలుగురుని అడిగితే, మేం థియేటర్స్ను వాళ్లకు అప్పజెప్పడానికి సిద్ధం… దమ్ముంటే మెయింటైన్ చేయండంటూ ఛాలెంజ్ విసురుతుంటారు. నిజానికి వీరు విసిరిన ఛాలెంజ్ ను వీరి పై విమర్శలు చేసిన ఎవ్వరూ స్వీకరించనేలేదు.
అయితే ఈ నలుగురినీ వెనక నుంచి మాత్రం తిట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే తెలుగులో ఎవ్వరూ సినిమా చేసినా సరే ఈ నలుగురు ద్వారానే సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అయితే ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్స్ షట్ డౌన్ లో ఉన్నాయి. అయితే ఈ లాస్ అంతటినీ లీజుకు తీసుకున్న ఈ నలుగురే భరించాల్సి ఉంది. దాదాపు ఒక్కొరికి నెలకి 15 కోట్లు చొప్పున నష్టం వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే ఆ నలుగురు థియేటర్ లీజ్ బిజెనెస్ నుంచి బయటకొచ్చేస్తారనే టాక్ ఉంది, ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.











