మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు. ఆయన కెరీర్ లోనే ఇలా నాలుగు సినిమాలను ఒకేసారి చేయడం జరగలేదు. ఇప్పుడు జరిగింది. అది కూడా.. అరవై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇంత స్పీడుగా సినిమాలు చేస్తుండడం విశేషం. చిరు నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య ప్రస్తుతం ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. చిరంజీవి ఈ డిసెంబర్ నెలలో ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్‌లు చేస్తూ, ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అవును.. ఇది నిజంగా నిజం. ఇటీవల చిరంజీవి ఆచార్య ప్యాచ్ వర్క్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇది చిరంజవి 152వ చిత్రం. ఈ సినిమా తర్వాత చిరు చేస్తున్న 153వ చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఊటీలో, హైదరాబాద్లో షూటింగ్ జరుపుకున్న గాడ్ ఫాదర్ షూటింగ్ లో కూడా చిరంజీవి నెలలో పాల్గొంటారు.
ఇక చిరంజీవి 154వ సినిమాని యంగ్ డైరెక్టర్ బాబీతో చేస్తున్నారు. ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు చిరంజీవి 155వ చిత్రం భోళా శంకర్ చేస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ డైరెక్టర్. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం ఓ పాటను చిత్రీకరించారు. ఈ నెలలో ఈ సినిమా షూటింగ్ లో కూడా చిరు పాల్గొంటారు. ఈవిధంగా ఒకే నెలలో నాలుగు చిత్రాల షూటింగ్ లో పాల్గొన్న స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
Must Read ;- మెగాస్టార్, బోయపాటి మూవీ ఫిక్స్ అయ్యిందా?











