చీలికలు .. ఒత్తుళ్లతో ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారా..?
పీఆర్సీ నివేదికను బయటపెట్టేందుకే ఇష్టపడి ప్రభుత్వం .. ఆ పీఆర్సీ ఎలా ఇస్తోందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి? ప్రభుత్వ మొండి వైకరికి జేఏసీల ఆధ్వర్యంలో నిరసన ఉద్యమాలు చేపడున్నాయని తెలిసి కూడా చిత్తూరు పర్యటనలో ఉండి ఏదో రోడ్డు మీద ఉండి పదిరోజులు పీఆర్సీ అని ప్రకటిస్తారు .. మరి స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అధికారులు పీఆర్సీ నివేదికను ఎందుకు బయట పెట్టేందుకు నిరాకరించారు? మంగళవారం నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైయ్యారు. కానీ ఉద్యోగుల ఉద్యమంలో ఐక్యత ఎందుకు లోపించినట్లు కనిపిస్తోంది? డిమాండ్స్ నెరవేర్చే క్రమంలో అవసరమనుకుంటే ప్రభుత్వాన్ని సైతం కూల్చేస్తామని జేఏసీ నేతల సీరియస్ డైలాగ్స్ ల్లో ఇప్పుడు ఆ కరుకు ఎందుకు తగ్గింది? లకంగు తిన్న మాదిరిగా మేం మీ బిడ్డాలమేనని మొరపెట్టుకున్న బండి శ్రీనివాసరావు ఈనాడు విశాఖలో మాట్లాడిన మాటల్లో ఆంతర్యమేమిటి? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఉద్యోగులపై నిన్నటి నుంచి ఒత్తిడి ఏ స్థాయిలో షురూ ఐందో ప్రత్యేకించి ప్రస్తావించనక్కర్లేదు. ఉద్యోగుల వారికున్న సమస్యల డిమాండ్స్ ను నెరవేర్చుకోవాలను కోవడం వారి హక్కు. అంతేతప్పా.. మితిమీరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాడంలేదు అన్నది జగన్ ప్రభుత్వం గమనించాలి. కేవలం వారికి జరిగిన అన్యాయాన్నే నినదిస్తున్నారు.. ఇందులో తప్పేముంది! అటువంటి వారిని మానసికంగా హింసించడం సరికాదు అన్నది ప్రభత్వం గుర్తించాలి.
అందుకేనా పూలు,పాలాభిషేకం!
65 లక్షల ఓట్లునున్నాయి… ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అన్న రాష్ట్ర ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్వరంలోని మార్పులకు కారణంగా ప్రభుత్వం ఒత్తిడే అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అలుగుతాం .. సీఎం తండ్రిలాంటివాడు.. మేం అందరూ ఆయన బిడ్డలం అంటూ హీన స్వరంతో మీడియా ముందు మాట్లాడిన శ్రీనివాస్ … ఉద్యోగులకు భవిష్యత్తులో ఏమని సమాధానం చెబుతారు. 13 లక్షల మంది ఉద్యోగులు మీపై బాధ్యతలను పెట్టి .. ఎంతో ఆశతో డిమాండ్స్ ను నెరవేరుస్తారని ఎదురుచూస్తుంటే ఇటువంటి మాటాలు మాట్లాడి వారి ఆశయాలకు తూట్లు పొడుస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క పీక కత్తిరించేందుకు కత్తినూరుతున్న కసాయి చర్యలు కంటికి కనిపిస్తుంటే .. ఇంకా పూలతో పూజిస్తాం .. పాలతో అభిషేకిస్తాం అనడంలో ఆంతర్యం అర్థం కానిది కాదు. ప్రభుత్వం నెరవేర్చాల్సిన డిమాండ్లు 71 ఉన్నాయన్న విషయం మరిచి ఎందుకు జేఏసీ నేతలు ఇలా పేలవలంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఒత్తిడి డోస్ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పన్నక్కర్లేదు. ఉద్యమంతో సాధ్యంకానివి అంటూ ఏమి ఉండవు అన్నది ఉద్యోగ సంఘాలను నడిపించే నేతలు గుర్తించాలి. ఉద్యోగులు రోదిస్తుంటే .. ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించడం అన్నద కల్లా! ఇప్పటికైనా ప్రభుత్వం.. ఉద్యోగ సమస్యలను సకాలం తీర్చి .. వారిని ఆదుకోవాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి.
Must Read ;- 70 లక్షల ఓట్లు మావి .. వీటితో జగన్ రెడ్డి మాయ ప్రభుత్వాన్ని కూల్చలేమా? బండి











