మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీని స్టార్ట్ చేశారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే.. ఇటీవల బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154వ చిత్రాన్ని ప్రారంభించారు. ఊర మాస్ అనేలా ఈ సినిమా ఉంటుందని.. ఫస్ట్ లుక్ తోనే తెలిసేలా చేశాడు బాబీ. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య, వాల్తేరు వాసు.. అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారు.
అయితే… ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇది కథలో చిరుకు తమ్ముడు పాత్ర అని.. కనిపించేది కాసేపే అయినా పవర్ ఫుల్ రోల్ అని టాక్ బయటకు వచ్చింది. గతంలో చిరంజీవి అన్నయ్య సినిమాలో రవితేజ నటించడం జరిగింది. చిరు అంటే రవితేజకు ప్రాణం. అందుచేత ఈ సినిమాలో నటించేందుకు రవితేజ ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ కీలక పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయించాలని బాబీ ప్రయత్నిస్తున్నాడని.. త్వరలో పవన్ ని కలిసి ఈ కథ గురించి చెబుతాడని ప్రచారం జరిగింది.











