జగన్ రెడ్డి పాలనలో హిందూ మతంపై దాడి..!
ఏపీలో జగన్ రెడ్డి పాలన ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 60 దేవాలయాలపై మతోన్మాదులు దాడికి పాల్పడ్డారు. అంతేకాక ప్రధాన దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఊపందుకుంది! మరోవైపు హిందూ దేవుళ్ల, ధర్మం పై నిత్యం ఏదో ఒక మూల దాడి జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలపై జరిగిన దాడుల్లో దేవత మూర్తులు, రథాలు ధ్వంసమయ్యాయి. తిరుపతి, శ్రీశైలం వంటి ఆలయాల్లో కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చి హిందూ మనోభావాలను కించపర్చిలే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై స్వామిజీలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చర్యలను ఖండిస్తూనే వస్తున్నారు. ఎంత తిట్టిపోసినా.. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, దేవత మూర్తులు, సంస్కృతి – సాంప్రదాయాలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్రైస్తవ మతం ఇప్పటికే రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇది హిందువులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది! మరోవైపు బలవంతపు మతమార్పిళ్లు కూడా తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్న అంశం!!
శ్రీశైలం దేవస్థానం మర్యాద కాపాడండి..!
ఏపీలో హిందూధర్మం పై జరుగుతున్న దాడులను అందరూ ముక్తం కంఠంతో ఖండిస్తున్నా.. జగన్ రెడ్డి ప్రభుత్వంపై దున్నపోతుమీద వాన కురిసిన చందగా ఉంది! వరస ఘటనలపై సీఎం జగన్ రెడ్డిపై ఈ సందర్భంగా తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్ ఘోరంగా విఫలం అయ్యారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తుల వ్యాపారాలు చేస్తున్నారని.. దీనిని వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టును ఆశ్రయిస్తే.. వేరే మతస్తులు సుప్రీం కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని వైఎస్సార్ హయంలో జీవో 426 ను తీసుకొచ్చారని రాజాసింగ్ గుర్తు చేశారు. జగన్ పాలనలో ఈ జీవోను పక్కన పెట్టి ఇతర మతస్తులు వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల తరుపున ప్రభుత్వం ఎందుకు అడ్వకేట్ ను నియమించలేదని ప్రశ్నించారు. శ్రీశైల దేవస్థానంలో ఇతర మతస్తులు ఉండేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాజాసింగ్ ఆరోపించారు. ఇటువంటి పద్దతులు, ధోరణులు రాబోయే రోజుల్లో మత కలహాలకు అజ్యం పోస్తాయని.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైన జగన్ రెడ్డి శ్రీశైల దేవస్ధానం ప్రతిష్టను నిలిపే ప్రయత్నం చేయకుంటే హిందువులు ఉద్యమించడం ఖాయమని మరోవైపు స్వామిజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.