మదర్ ల్యాండ్ తమిళనాడు అయినప్పటికీ.. టాలీవుడ్ లోనే కథానాయికగా నిలబడాలని తపించింది రెజీనా కసాండ్రా. అయితే ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. కొన్ని విజయాలు దక్కినప్పటికీ.. అమ్మడికి ఇక్కడ సరైన గుర్తింపే రాలేదు. అయినా సరే.. సౌత్ లో పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ.. ఇటు గ్లామర్ వేషాలు వేస్తూ.. అటు విలన్ గానూ నటిస్తూ తన కెరీర్ ను లాగిస్తోంది. ‘ఎవరు , 7, చక్ర’లాంటి సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్.
తాజాగా రెజీనా తెలుగు, తమిళ భాషల్లో ‘బోర్డర్’ అనే మూవీలో నటిస్తోంది. అరుణ్ విజయ్ హీరోగా నటిస్తోన్న ఈ స్పై అడ్వంచరస్ థ్రిల్లర్ లో రెజీనా రా అధికారిగా నటించుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అరివళగన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా స్టెఫీ పటేల్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రెజీనా రా ఆఫీసర్ కు సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. ఆ పాత్రకు ఆమె పెర్ఫాక్ట్ గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. మరి రా అధికారిగా రెజీనా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.