రీసెంట్ గా పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. తెలుగు ప్రేక్షకులు నడుము అందం, బొడ్డు చూపిస్తే చాలు.. అభిమానిస్తారు అంటూ పూజా తెలుగు ప్రేక్షకుల్ని తక్కువ చేసి మాట్లాడింది అంటూ.. నెటిజెన్స్ ఆమెను విమర్శించడం ప్రారంభించారు. తెలుగు ప్రేక్షకుల పట్ల అంత నీచమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమెను తెలుగులో నటించనివ్వడం అవసరమా అంటూ కొందరు నెటిజెన్స్ ఆమె మీద వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. దాంతో ఈ విషయం సీరియస్ అవ్వకూడదనే ఉద్దేశంతో పూజా తెలుగులో ఒక పోస్ట్ షేర్ చేసింది.
‘నేను ఇంటర్వ్వూలో అన్నమాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో గానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎన్నటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణ సమానం. ఇది నా చిత్రాల్ని అభిమానించేవారికి, నా అభిమానులకీ తెలిసినా, ఎటువంటి అపార్ధాలకూ తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నా.. నాకు ఎంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి నేనెంతో రుణపడి ఉంటాను. వాచ్ ది ఫుల్ ఇంటర్వ్యూ థాంక్స్’ .. అంటూ పోస్ట్ చేసింది పూజ.
ఏ సందర్భంలో ఆమె ఆ మాటలు వాడినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు అలా అన్నారని ఆమె అనడం సరికాదన్నది కొందరి వాదన. తెలుగు ఇండస్ట్రీ తనకు ప్రాణ సమానమని ఆమె చెప్పింది కాబట్టి.. ఈ విషయంలో ఆమెను క్షమిస్తారేమో చూడాలి. ప్రస్తుతం పూజా రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లో నటించింది. వాటి విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ మూవీస్ తో వరుస అవకాశాలు అందుకుంటాననే నమ్మకంతో ఉంది. అందుకే ఈ టైమ్ లో ఆమె మీద ప్రేక్షకుల్లో తప్పుడు అభిప్రాయం కలగకూడదనే ఉద్దేశంతో ఇలా జాగ్రత్త పడుతోందని అనుకోవాలి. మరి ఆమె షేర్ చేసిన పోస్ట్ పై నెటిజెన్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి.