మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఆచార్య కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. అయితే.. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూపించబోతున్నారని టాక్ వినిపించింది. ఇప్పుడు ఆచార్య టీజర్ రిలీజ్ చేశారు.
ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు అంటూ రామ్ చరణ్ వాయిస్ తో మొదలైన చిత్ర టీజర్… ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ ను బట్టి దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఆచార్య ఎలా అరికట్టాడనే కథాంశంతో రూపొందుతోందని కన్ ఫర్మ్ అయ్యింది. ఇలా ఆచార్యలో ఆథ్యాత్మిక కోణం ఉండడం విశేషం అనుకుంటే.. బాలయ్య, బోయపాటి మూవీలో కూడా ఆథ్యాత్మిక నేపథ్యం ఉండడం మరో విశేషం.
ఇంతకీ బాలయ్య మూవీలో ఆథ్యాత్మిక కోణం ఏంటంటే.. ఈ సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ లో బాలకృష్ణ ఆధ్యాత్మిక వేత్తగా కనిపించనున్నాడని కొందరు అంటుంటే.. అఘోరాగా కనిపించనున్నారని మరి కొందరు అంటున్నారు. దాంతో బాలకృష్ణ అలా మారడానికి కారణం ఏమిటి ? అంతకుముందు ఆయన పాత్ర తీరు తెన్నులేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా.. చిరు, బాలయ్య చేస్తున్న సినిమాల్లో ఆథ్యాత్మిక కోణం బయటపడడంతో ఈ రెండు చిత్రాల పై అంచనాలు అధికమయ్యాయి. మరి.. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాల్లో ఏది మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- ‘ఆచార్య’ వెర్సెస్ ‘నారప్ప’