నందమూరి నటసింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగానే స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా.. బాలయ్య మాత్రం కాస్త ఆలస్యంగానే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇంతకీ.. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సారధి స్టూడియోలో.
ఈ తాజా షెడ్యూల్ లో బాలయ్య మాస్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారని తెలిసింది. ఇంతకీ ఎవరితో అంటే.. ప్రగ్యా జైస్వాల్ తో. బాలయ్య, ప్రగ్యా జైస్వాల్ పై మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ పూర్తైన వెంటనే… సారధి స్టూడియోలోనే భారీ యాక్షన్ సీన్స్ ను కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇందులో హీరో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఇక మెయిన్ విలన్ గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు.
ఈ క్రేజీ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి.. ఈ మూవీ సమ్మర్ రేసు నుంచి తప్పుకుందని సమాచారం. అయితే.. దసరాకి ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సింహ, లెజెండ్ చిత్రాలను మించిన సక్సస్ ఇవ్వాలని.. అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. బోయపాటి ఈసారి బాలయ్యతో ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.
Must Read ;- చిరు – బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ