2020లో కరోనా కారణంగా మార్చి తర్వాత నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు సినిమాలు థియేటర్లో రిలీజ్ కాలేదు. సంక్రాంతి నుంచి థియేటర్లో సినిమాలు రిలీజ్ కావడం.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో.. భారీ చిత్రాలు థియేటర్లోకి వచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ పోటీ రోజురోజుకు పెరుగుతుండడంతో నిర్మాతలు పోటీపడి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ముందుగా ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ మూవీని మే 14న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఆచార్య మే 13న విడుదల అంటూ ప్రకటించారు. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది.
టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుండడం విశేషం. చిరంజీవి ఆచార్య టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా వస్తున్న నారప్పగా వెంకీ కొత్త లుక్, మేనరిజంతో అదరగొట్టేస్తున్నాడు. ఇలా ఒక రోజు తేడాతో చిరు, వెంకీ పోటీపడుతుండడంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. మరి.. ఈ బాక్సాఫీస్ వార్ లో విజేతగా నిలిచేది ఎవరో చూడాలి.
Must Read ;- చిరంజీవి , బాలకృష్ణ సినిమాల్లో ఆధ్యాత్మిక కోణం











