బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. ‘భరత్ అనే నేను’ సినిమా తర్వాత కొరటాల మెగాస్టార్ తో సినిమా చేయాలి అనుకున్నారు. అప్పుడు చిరు సైరా నరసింహారెడ్డి సినిమాలో బిజీగా ఉండడంతో ఆచార్య స్టార్ట్ కావడానికి బాగా టైమ్ పట్టింది. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత షూటింగ్ కి బ్రేకులు పడడంతో ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ సమ్మర్ కి ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ‘ఆచార్య’ కోసం ప్రత్యేకంగా వేసిన టెంపుల్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. చరణ్ సన్నిహితులు, అభిమానులు ఈ సెట్ కి వెళ్లి కలుసుకోవడం.. చరణ్ తో ఫోటోలు దిగడం జరిగింది. అయితే.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఆచార్య’ కోసం వేసిన టెంపుల్ సెట్.. ఈ సినిమాకి చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు ఈ సెట్ సింహ ద్వారం రివీల్ అయ్యింది.
ఈ సెట్ సింహా ద్వారం చిరంజీవి వలన రివీల్ అయితే.. ఈ టెంపుల్ సెట్ లోని కీలక భాగాలన్ని చరణ్ ఫ్యాన్స్ వలన బయటకు వచ్చేశాయి. దీంతో కొరటాల ఇలా సెట్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చేస్తే ఎలా అంటూ సిబ్బంది పై సీరియస్ అయ్యారట. ఇక నుంచి ఎవర్ని రానివ్వద్దని తన సిబ్బందికి కాస్త సీరియస్ గానే చెప్పారట కొరటాల. ఇదంతా గమనించిన చరణ్ ఇక నుంచి తనవాళ్లని కూడా సెట్ లోకి రానివ్వద్దని చెప్పడంతో కొరటాల కూల్ అయ్యారట. అదీ.. సంగతి.
Must Read ;- మెగాస్టార్ తో ఆ నలుగురు కెప్టెన్లు











