వెండితెరపైనే కాదు, బుల్లితెరపైనా బాలయ్యకు బ్రహ్మాండమైన క్రేజ్ ఉంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. బాలయ్య టాలెంట్ కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అన్ స్టాపబుల్ రెండు సీజన్లకూ అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మూడో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
రెండో సీజన్ కు పొలిటికల్ గ్లామర్ అద్దిన బాలయ్య అంచనాలకు అందని గెస్ట్ లను రంగంలోకి దించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో ఆయన చేసిన షోలు రికార్డులు బద్దలు కొట్టాయి. బాలయ్య టైమింగ్, ఆయన వేసే పంచ్‌లకు బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలయ్య నెక్ట్స్ అన్ స్టాపబుల్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ లోగానే నిర్వాహకులు గుడ్ న్యూస్ చెప్పుటయంతో ప్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.
ఈ నెల దసరా రోజున అన్ స్టాపబుల్ త్రికి ముహూర్తం ఫిక్సయింది. ఈ సీజన్‌లో సినీ ప్రముఖుల కంటే
పొలిటీషియన్లలే గెస్ట్ లుగా పిలిచారన్న టాక్ తో షోకు మరింత క్రేజ్ పెరిగింది. ఆహా ఓటీటీ వ్యూయర్స్ ను అమాంతం పెంచేసిన అన్ స్టాపబుల్‌కు కొత్త మెరుగులు దిద్దారట. బాలయ్య సూచనల మేరకు నిర్వాహకులు సామన్యులు, య్యూట్యూబర్లను సైతం రంగంలోకి దించారట. వీటన్నిటి కంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైన వేళ ప్రారంభం కాబోతున్న ఈ అన్‌స్టాపబుల్ -3లో బాలయ్య ప్రత్యేకంగా కొంత మందిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. వారిలో ప్రముఖంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్లు కూడా ఉన్నారని తెలుస్తోంది..
అయితే, థర్డ్ సీజన్‌లో స్టార్టింగ్ లోనే లేదంటే కాస్త ఆలస్యంగా అయినా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్ స్టాపబుల్ లో అడుగుపెట్టడం వైసీపీకి బిగ్ షాక్ అని చెబుతున్నారు ఎనలిస్టులు.. ఇటీవల రజనీకాంత్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకు హాజరై.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. రజనీ వ్యాఖ్యలు వైసీపీని అతలాకుతలం చేశాయి.. ఆయన కామెంట్స్‌పై అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర అభ్యంతరకర విమర్శలు చేశారు. ఆ తరవాత రజనీకాంత్ సైతం వారికి కౌంటర్ ఇచ్చాడు.. ఇటీవల బాక్సాఫీస్ దగ్గర విడుదలై సంచలన విజయం సాధించిన జైలర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అర్ధమయిందా రాజా అంటూ ఆయన పేల్చిన డైలాగులు వైరల్‌గా మారాయి.. వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.. ఇలాంటి టైమ్‌లో రజనీకాంత్ అన్ స్టాపబుల్ లో అడుగుపెట్టడం హాట్ హాట్ గా మారుతోంది.. దీనిని ఎలా ట్రోల్ చేయాలా అని నీలి, కూలి మీడియాకి పెద్ద టాస్కులు ఇచ్చినట్లు సమాచారం..
మరోవైపు, ఇదే సీజన్‌కి మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంట్రీ ఇవ్వనున్నారు.. ఇటీవల వైసీపీ సర్కార్‌పై పరోక్ష విమర్శలు ఎక్కుపెట్టారు చిరంజీవి.. ఆయన సైతం బాలయ్యతో కలిసి చిత్ర పరిశ్రమ పట్ల జగన్ అనుసరిస్తున్న వైఖరిపై విరుచుకుపడడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.. దీంతో, ఇది కూడా జగన్ టీమ్‌కి, ఆయన అభిమానులకి కార్యకర్తలకి పెను సవాల్‌గా మారుతోంది..
మరి, ఈ ఎపిసోడ్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..











