వైసీపీ ఎమ్మెల్యేలకే కాదు.. ఆ పార్టీ మంత్రులకు కూడా నియోజకవర్గాల్లో నిరసన సెగలు తప్పడంలేదు. అధికారం.. హోదా ఉందని విర్రవీగే ప్రజా ప్రతినిధులకు వైసీపీ పాలన విధానాలు.. ప్రభుత్వ వైఫల్యాలే పెద్ద ఉదాహరణ.., చెంపపెట్టు..!
ఎన్నికల్లో 100 కోట్లు పంచేద్దాం.. 1000 కోట్లు దోచేద్దాం .. అన్నది ప్రస్తుతం సాగే వ్యాపార కోణ రాజకీయం. ప్రజా సేవ.., పాదదర్శక పాలన..,ప్రజాభిష్టం మేరకు సాగే సంక్షేమం.., ప్రజా డిమాండ్స్ మేరకు జరిగే అభివృద్ధి.. ఉపాధి.., ఉద్యోగం వంటివి… ఓట్లను రంగు కాగితాలకు అమ్ముకునేంత వరకు సాధ్యకావు. అందుకే మార్పు నేర్పు.. నాయకుల వద్ద నుంచే కాదు.. ఓటు వేసే యువత నుంచి.., కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు జరగవల్సిందే. ఈ నాలుగునరేళ్ళ కాలంలో ప్రజలు ఓటు విలువను.. డబ్బుతో.., బిర్యాని-మద్యంతో మూడిపెడితే ఎంత నష్టపోతామో బాగానే అర్థం చేసుకున్నారు కాబోలు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై.., మంత్రులకు పై ప్రజలు నేడు తిరగబడుతున్నారు.
నిజాయితీ నిలకడగానే తెలుస్తోంది. ఈ సూక్తిని ప్రజలకు బాగానే బోధపడింది. ఎందుకంటే కులం.., మతం.., డబ్బుతో లోబర్చుకునే విధానాలను ఆయుధాలు మల్చుకుని సాగించే రాజకీయాలు ఎంత ప్రమాదకరమో ఏపీలో జగన్ రెడ్డి సాగిస్తున్న పాలన విధానాలు.. ఆ ప్రభుత్వం చేస్తున్న మారణహోమాలే నిదర్శనం. ఆయన చేసే ప్రమాదకర రాజకీయాలకు సొంత కుటుంబం సభ్యులేకాదు.. నమ్ముకున్న నేతలకు.. కొమ్ము కాస్తున్న సలహాదారులు అతీతులేం కాదు. ఈ దెబ్బతో.. సమాజీకంగా.., ఆర్ధికంగా.., రాజకీయంగా.., వ్యక్తిగతంగా.. అన్నీంటిని బేరీజు చేసుకుని జీవితంలో మనం ఎవరికి ఓటు వేయాలి.. జీవితాంతం ఎవరికి వేయకూడదు అన్న క్లారిటీ ప్రజలకు వచ్చింది.
అందుకేనేమో వైసీపీ ఎమ్మెల్యేలపై.., మంత్రులపై ప్రజలు తత్వం బోధపడి తిరగపడున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు., మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. మా ప్రాంతాల అభివృద్ధిని గాలికొదిలేసి.. పథకాల పేరుతో డబ్బులిస్తే సరిపొద్దా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నిన్న పెడనలో మంత్రి జోగి రమేష్ పై.., సత్తెనపల్లిలో మరో మంత్రి అంబటి రాంబాబు పై ప్రజలు తిరగపడ్డారు. జనాలు చస్తున్న మా గోడు పట్టించుకోరా అంటూ నిలదీశారు. ప్రశ్నించి..నిలదీస్తే కేసులు కట్టి జైల్లో వేస్తారా..? అంటూ కడిగేశారు. దీంతో భవిష్యత్ బొమ్మ కనిపించి.. అక్కడ నుంచి ఆ మంత్రులు పారిపోయారు.
ఇక చాలదా..? ఇంతకన్నా.. దిగజారుడు రాజకీయాలు ఏమైనా ఉన్నాయా….? అధికారం ఉంది కదా.. అని ప్రజలను అణచివేయాలని చూస్తే .. ఇటువంటివే ప్రజలను నుంచి రిపీట్ అవుతుంటాయన్నది వాస్తవం. ఇప్పటీకైనా ప్రజా మార్పును గమనించి.. డబ్బుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న విధానాలను వదులుకుంటే మంచిదని విశ్లేషణలు ఉన్నాయి.