ఇక ముస్లీం మైనారిటీల పరిస్ధితి ఏపీలో దారుణంగా మారింది. జగన్ రెడ్డి ఈ నాలుగునరేళ్ళ పాలనలో మైనారిటీల చితికిపోయారు. రాష్ట్రంలో అత్యంధికంగా వివక్షకు గురైంది ముస్లీంలే. కక్షపూరితంగా అక్కసు వెల్లగక్కిమరి హింసలకు గురిచేశారు. గత ఆరు దశాబ్ధాల్లో ఎన్నడూ చూడని అణచివేతను ముస్లీంలు ఏపీలో చవిచూశారన్నది అక్షర సత్యం. అధికారపార్టీ నేతలతో చేసే దుర్మార్గాలను తట్టుకోలేకా.., ప్రశ్నించే పోరాడే శక్తిలేక తనవు చాలించిన కుటుంబాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు నాలుగేళ్ళల్లో ముస్లీంలపై వ్యక్తిగతంగా.., సామాజీకంగా.., ఆర్థికంగా అనేక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సర్వం కోల్పోయి రోడ్డున పడిన వాళ్ళు కొందరైతే.. పోరాడలేక తనువు చాలించే ఘటనలు అనేకం.
జగన్ రెడ్డి ఏపీలో పాలన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముస్లీంలపై జరుగుతున్న వరుస దాడులకు సమాధానం చెప్పి తీరాలి. వేదికలపై నా ఎస్సీలు.. నా బీసీలు.. నా ఎస్టీలు.., నా మైనారిటీలు అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేసే ముఖ్యమంత్రి .. అధికారపార్టీ నేతల చేతిలో చిదిమేయపడినా.. నేటికీ పడుతున్న ముస్లీంల బ్రతుకు చిత్రం కనిపించడం లేదా..? అంటూ బాధిత వర్గాలు ప్రశ్నింస్తున్నాయి. వారిపై నిత్యం భౌతిక దాడులు.., ఆస్తుల కబ్జాలు.., ఇళ్ళల్లోని మహిళలను హింసించడం.., అక్రమ అరెస్ట్ లు వంటివి అనేకం జరుగుతున్నా.. జగన్ ఏనాడూ బాధితుల పక్షాన ఊరట కల్పించే మాటలు మాటల్లేక పోయారు. కనీసం స్పందించిన పాపాన పోలేదు. దీంతో ఏపీలోని ముస్లీంలందరూ ప్రస్తుతం డిఫెన్స్ లో పడ్డారు.
మచ్చుకకు కొన్ని ముస్లీంలపై జరిగిన దాడి ఘటనలు చూస్తే కంట్లో నీళ్లాగవు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేదింపులు భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా పలమనేరులో విద్యార్ధి మిస్బా ఆత్మహత్య.., పల్నాడు జిల్లా గురజాల.., మాచర్ల నియోజకవర్గాల్లో ముస్లీం ఇళ్ళపైకి వెళ్ళి వైసీపీ నేతల చేసిన దాడి.., నెల్లూరులో మస్తాన్ బీ భూమిలాక్కోవడంతో ఆత్మహత్య యత్నం… ఇలా చెప్పుకుంటూ పోతే 13 జిల్లాల్లో వందల కొద్దీ ముస్లీం కుటుంబాలు తీవ్ర అణచివేతకు గురైయ్యాయనే చెప్పాలి. ఇవన్నీ అధికార వైసీపీ కంబంధ హస్తలలో నలిగినవే. ప్రధానంగా ముస్లీంల ఆస్తులపై వైసీపీ నాయకుల చేసినా.. చేస్తున్న దౌర్జన్యాల కారణంగానే అధిక సంఖ్యలో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నది సత్యం.
అంతిమంగా ఒక్కమాటలో చెప్పలంటే ఏపీలో ముస్లీంల పరిస్ధితి పోరాడే వాళ్ళైతే.. భూమిపై ఉన్నారు… ఎదిరించలేని వాళ్ళు .. దివికి ఎగారు. ఇంతకన్న సామాజీక పరాకాష్ట ఏదైనా ఉందా..? అని సామాజీక మాధ్యమాల్లో జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.











