Team India Targeting Series Against Sri Lanka :
యువ ఆటగాళ్ల దూకుడుతో టీంఇండియా మొదటి వన్డేలోనే శ్రీలంకపై దుప్పురేపింది. అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ధవన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో పాటు పృథ్వీషా, ఇషాన్ కిషన్ ధనాధన్ బ్యాటింగ్ తో లంక నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
పోటీ ఇవ్వని లంక
ఎలాంటి మార్పులు లేకుండా టీంఇండియా రెండో వన్డే సిద్ధమవుతోంది. మొదటి వన్డేలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ పృథ్వీ షా ఈ వన్డేలో భారీ స్కోర్ చేయాలని భావిస్తున్నాడు. చాలారోజుల తర్వాత కలిసి బరిలోకి దిగిన కుల్దీప్ యాదవ్, చాహల్ జోడీ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఐదు ఓవర్లు వేయడం బాగా కలిసివచ్చింది. రెండో వన్డే గెలిచి ఎలాగైనా సిరీస్ దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక శ్రీలంక పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గెలవడం మాట అటుంచి కనీసం ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది.
పిచ్ రిపోర్ట్
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఛేజింగ్ చేయడానికి ఇరు జట్లు ఆసక్తి చూపవచ్చు.
Must Read ;- మిథాలీ ఘనత : ఇండియా రికార్డును బీట్ చేయడం కష్టమే!