Rishabh Pant Tests Covid Positive :
కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. క్రికెటర్లను సైతం వదలడం లేదు. పీపీఈ కిట్లు ధరిస్తూ.. కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రభావం చూపుతూనే ఉంది. ఐపీఎల్ సమయంలో భారత ఆటగాళ్లే కాకుండా.. విదేశీ ఆటగాళ్లు కూడా కొవిడ్ బారిన పడ్డారు. కరోనా కారణంగానే ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టుకు షాక్ తగిలింది. భారత జట్టుకు చెందిన కీలక ఆటగాడు కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆటగాడు ఎవరో కాదు.. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ అట. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. పంత్ ఎనిమిది రోజుల క్రితమే కరోనా బారిన పడ్డినట్టు తెలుస్తోంది. ఇతర ఆటగాళ్లకు వైరస్ సోకకుండా, పంత్ ను ప్రత్యేకమైన గదిలో ఐసోలేట్ చేశారు.
లండన్ వీధుల్లో విహారం
న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు చాంపియన్ ముగిసిన తర్వాత బీసీసీఐ భారత ఆటగాళ్లకు రెస్ట్ ను ఇచ్చింది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు 40 రోజుల సమయం ఉండటంతో భారత ఆటగాళ్లు లండన్ వీధుల్లో వీరవిహారం చేశారు. కెప్టెన్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో టూర్ వేస్తే.. మిగతా ఆటగాళ్లు కొందరు యూరో కప్, వింబుల్డన్ మ్యాచులకు తిలకించారు. మాస్కు ధరించకుండా, భౌతిక పాటించకుండా మ్యాచ్ లను చూశారు. అంతేకాదు.. ఫ్యాన్స్ కు సెల్ఫీలు కూడా ఇచ్చారు. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతనే పంత్ కు కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఈ నెల 18న పంత్ కు మరోసారి కోవిడ్ పరీక్ష చేస్తారు. అప్పుడు నెగెటివ్ రిపోర్ట్ వస్తేనే పంత్ గ్రౌండ్ అడుగుపెడతాడు.
Must Read ;- ఫ్యామిలీతో కోహ్లీ టూర్.. కూతురు వామిక పిక్స్ వైరల్!











