Central Minister Murugan Parents Continue As Farm Labourer’s :
కుటుంబం సభ్యుల్లో ఎవరైనా కౌన్సిలరో.. కార్పొరేటరో ఉంటేనే.. ఫ్యామిలీలోని మిగతవాళ్లంతా తెగ బిల్డప్ ఇస్తారు. ఖరీదైన వాహానాల్లో తిరుగుతూ గొప్పలకు పోతారు. కానీ కొడుకు కేంద్రమంత్రి అయినా కూలీ పనులకు వెళ్లేవాళ్లు తల్లిదండ్రులు ఉంటారా…? పేదలపాటు రేషన్ సరుకుల కోసం క్యూలో నిల్చున్నవాళ్లు ఉంటారా..? అంటే ఆశ్చర్యమే వేస్తుంది. కానీ తమిళనాడుకు చెందిన ఈ తల్లిదండ్రులకు అందుకు మినహాయింపు. కొడుకు కేంద్ర మంత్రి అయినా తమ పని తాము చేసుకుపోతూ శ్రమైక జీవన ఆనందం పొందుతున్నారు.
కేంద్ర సహాయ మంత్రిగా ఎల్.మురుగన్ (Central Minister Murugan)
తమిళనాడుకు చెందిన ఎల్. మురుగన్ ఇటీవల కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన మురుగన్ పార్టీ బలోపేతం శక్తివంచన లేకుండా పనిచేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మురుగన్ ఓడిపోయారు. కానీ నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. బీజేపీ అధిష్ఠానం, ప్రధాని నరేంద్ర మోదీ మురుగన్ పనితీరును గుర్తించారు. అందుకు బదులుగా కేంద్ర సహాయ మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో మురుగన్ తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడింది. అయితే ఆయన తల్లిదండ్రులు వరుదమ్మాళ్ (60), లోకనాథన్ (65) మాత్రం తమిళనాడులోని తమ సొంతూరు కోనూర్‌లోనే ఉండటం విశేషం.
సాధారణ జీవనం
మురుగన్ తల్లిదండ్రులు చిన్న ఇంట్లో ఉంటూ.. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎకరా భూమి కూడా లేదు. ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాయం కింద ఉచిత బియ్యం అందిస్తే.. అందరిలానే మురుగన్ తండ్రి లైన్‌లో నిలబడి సరుకులు తెచ్చుకున్నారు. ‘మీ కొడుకు కేంద్ర మంత్రి కదా’ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అయితే మాకేంటి? సింపుల్ గా సమాధానమిస్తారు. అప్పులు చేసి తమ బిడ్డను చదివించామని, ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదగడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతారు. మురగున్, వాళ్ల తల్లిదండ్రుల గురించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ ‘‘కొడుకు ఎల్ మురుగన్ కేంద్ర మంత్రి అయినా సరే.. ఆయన తల్లిదండ్రులు పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.. హ్యాట్సాఫ్’’ అంటూ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది.
Must Read ;- కాంగ్రెస్ లోకి పీకే?.. మోదీకి కష్టమేనా?