టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఆడుతుండడం లంక జట్టుకు కలిసొచ్చే అంశమే అయినా, అన్ని రకాల పిచ్ లపై ఆడిన అనుభవం టీమిండియా ఆటగాళ్లకు ఉంది. అయితే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీంఇండియా ఈ సీరిస్ ను ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది.
ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ మాత్రమే నష్టపోయింది. యజ్వేంద్ర చహల్ అద్భుతం చేశాడు. వేసిన 10వ ఓవర్ తొలి బంతికి ఫెర్నాండో(32) ఔటయ్యాడు. చహల్ కు తొలి ఓవర్ కాగా, వేసిన తొలి బంతికే వికెట్ తీయడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.