ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ఏదంటే ‘పొన్నియన్ సెల్వన్’ అనే చెప్పాలి. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నటించే నటీనటుల పేర్లను మాత్రం రివీల్ చేయడం లేదుగానీ అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, పార్తిబన్, జయరాం, విక్రమ్, ఐశ్వర్యారాయ్, జయం రవి, కార్తి, త్రిష లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలన్నది నిర్మాతల సంకల్పం. చోళ రాజుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

థాయిలాండ్ లోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. పులి బొమ్మ ఉన్న ఖడ్గం ఫొటోను మాత్రం విడుదల చేశారు. ప్రముఖ రాసిన కల్కి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మణి రత్నంకు చెందిన మద్రాసు టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. లైకా సంస్థ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. నిర్మాత సుభాస్కరన్ తమ సంస్థ నుంచి అనేక భారీ చిత్రాలను నిర్మించారు. రజనీ, అక్షయ్ లతో 2.0, నవాబ్, దర్భార్, కత్తి లాంటి చిత్రాలు నిర్మించారు.
2022లో రెండు భాగాలుగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఒకప్పుడు మణిరత్నం పేరు చెబితేనే సినిమాలు హిట్ అయ్యేవి. ఆ మెరుపు ఆ తర్వాత తగ్గిపోయింది. మళ్లీ తన మార్కుతో ఓ మంచి చిత్రం చేయాలన్న సంకల్పంతో మణిరత్నం ఈ సినిమా రూపొందిస్తున్నారు. కరోనా పరిస్థితులు సర్దుమణగడంతో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇది కూడా పాన్ ఇండియాకు మించి ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ తరహాలోనే ఈ ‘పొన్నియన్ సెల్వన్’ రూపొందుతోంది.
Must Read ;- కళ్యాణ్ రామ్ మరో ప్రయోగం ఫలిస్తుందా?











