మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ, తుళు సుందరి కృతి శెట్టి జంటగా నటించిన విలేజ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’. డెబ్యూ దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఈ నెల 12న థియేటర్స్ లో విడుదలైంది. విడుదల రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. కేవలం రూ. 30కోట్లతో రూపొందించిన ఈ సినిమా దాదాపు రూ. 70కోట్ల షేర్ వసూలు చేసి.. ఇండస్ట్రీ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది.
కొత్త హీరో వైష్ణవ్ తేజ పెర్ఫార్మెన్స్, హీరోయిన్ కృతిశెట్టి అందాలు .. తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి విలనిజం.. ఎంచుకొన్న కథాంశం , హై స్టాండర్డ్స్ తో కూడిన నిర్మాణ విలువలు.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం.. ఈ సినిమాను ఎక్కడో నిలిపాయి. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ తో .. హీరో, హీరోయిన్స్ ఇద్దరూ అవకాశాల ఉప్పెనలో మునిగితేలుతున్నారు. ఇప్పుడీ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఉప్పెన సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్ . ఈ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.
Must Read ;- కృతిశెట్టి రెమ్యూనరేషన్ ఎంత పెంచిందో తెలుసా?











