ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది కృతిశెట్టి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుని రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. దీంతో కృతిశెట్టి కి మరింత డిమాండ్ పెరిగింది. అయితే.. ఈ అమ్మడు ఫస్ట్ మూవీ ఉప్పెన రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ పై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అలాగే సుధీర్ బాబు రొమాంటిక్ ఎంటర్టైనర్ లోనూ కృతి శెట్టే కథానాయిక. ఇలా ఉప్పెన రిలీజ్ కాకుండానే.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఉప్పెన బ్లాక్ బస్టర్ అవ్వడంతో కృతి శెట్టికి క్రేజ్ బాగా పెరిగింది. దీంతో తనకు వచ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మడు రేటు బాగా పెంచేసిందట. ఇంతకీ.. ఎంత పెంచిందంటే.. ఉప్పెన సినిమాకి కేవలం 6 లక్షలే రెమ్యూనరేషన్. ఆతర్వాత సైన్ చేసిన నాని శ్యామ్ సింగ రాయ్, సుధీర్ బాబు సినిమాలకు ఒక్కో సినిమాకు 25 లక్షలు చొప్పున తీసుకుందట.
ఫస్ట్ మూవీ కావడం.. అది కూడా టాప్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి 6 లక్షలకే ఓకే చెప్పిందట. ఆతర్వాత సినిమాలకు 25 లక్షలు చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు రెమ్యూనరేషన్ ఎంతంటే… అక్షరాల 60 లక్షలు చెబుతుందట. అయినప్పటికీ 60 లక్షలు ఇవ్వడానికి రెడీ అంటున్నారు దర్శకనిర్మాతలు. ఉప్పెన తర్వాత రానున్న సినిమాలు హిట్ అయితే.. అప్పుడు రెమ్యూనరేషన్ ఇంకా పెంచేసినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.
Must Read ;- ఉప్పెన మూవీకి ఫస్ట్ హీరోయిన్ కృతి కాదా.?