చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ.. రూపొందిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇక కథానాయికగా కృతి శెట్టి పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఉప్పెన ఇంతటి విజయం సాధించడానికి కృతి శెట్టి కూడా ఓ కారణం అని చెప్పచ్చు. మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి అద్భుతంగా నటించింది. ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది. ఆమె డేట్స్ దొరకడం కష్టం అవచ్చు అని చెప్పారు.
ఇక ఉప్పెన సక్సస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా కృతి స్టార్ హీరోయిన్ అవుతుందని.. ఆమె డేట్స్ దొరకడం కూడా కష్టమేనని అన్నాడంటే ఆమెకు అంతకంటే కాంప్లిమెంట్ లేదు. ఇదిలా ఉంటే.. ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫస్ట్ కృతి శెట్టి కాదు. సునీల్ హీరోగా నటించిన 2 కంట్రీస్ లో కథానాయికగా నటించిన మనీషా రాజ్. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి. ఉప్పెన కోసం చాలా మంది అమ్మాయిలను చూసి ఆఖరికి మనీషా రాజ్ ను ఎన్నుకున్నాడు. ఉప్పెన ప్రారంభోత్సవంలో వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్ పైనే చిరంజీవి క్లాప్ ఇచ్చారు.
అయితే.. అనుకోకుండా బుచ్చిబాబు ఓ రోజు ఫేస్ బుక్ లో కృతి శెట్టి ఫోటోలు చూసాడట. అంతే.. ఉప్పెన బేబమ్మ పాత్రకు కృతి శెట్టి అయితే.. కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించాడట. ఆల్రెడీ మనీషా రాజ్ ను సెలెక్ట్ చేసాం. ఇప్పుడేమో కృతి శెట్టి అయితే.. బాగుంటుంది అనిపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక డైలమాలో పడ్డాడట. అప్పుడు గురువు సుకుమార్ ను సలహా అడిగితే.. నీకు ఏది నచ్చితే అది చేయ్. కాంప్రమైజ్ కావద్దు అని చెప్పారట. అప్పుడు మనీషాను తప్పించి కృతిని తీసుకున్నారట. ఈవిధంగా మనీషా రాజ్ పై కాలం కక్ష కట్టింది.. కృతి శెట్టికి కాలం కలిసొచ్చింది.
Must Read ;- అఖిల్ జోడీగా ఉప్పెన బ్యూటీ