వైసీపీ నేత కండకావరం!
ప్రభుత్వ భూమిని అక్రమించుకోవడమేకాక, చట్టప్రకారం అది నేరమని చెప్పిన రెవిన్యూ అధికారులపై అధికార మదంతో వైసీపీ నేత దాడి దిగారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలోని సర్వే నెంబర్ 355లో సుమారు 80 సెంట్ల గెడ్డ పోరంబోకు భూమి ఉంది. దీని విలువ ప్రస్తుతం భారీగా పెరిగింది. ఈ స్థలంపై పశ్చిమ నియోజవర్గం సమన్వయకర్త, రాష్ట్ర విద్యా వసతుల కల్పన సంస్థ ఛైర్మన్ మళ్ల విజయప్రసాద్ ముఖ్య అనుచరుడు, జీవీఎంసీ 88వ వార్డు వైసీపీ ఇన్ చార్జి దొడ్డి కిరణ్ కన్నేశాడు. దాని పక్కనున్న తన రెండు ఎకరాల భూమిలో గెడ్డపోరంబోకు భూమిని కలుపుకుంటూ ఆరు నెలల కిందట ప్రహరీ నిర్మించాడు. ఈ విషయంపై పలువురు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు అక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఎక్స్కవేటర్ సహాయంతో పహరీని కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమైన తరుణంలో.. వైసీపీ నేత కిరణ్ ఆర్ఐ శివకుమార్ తోపాటు అక్కడికొచ్చి రెవిన్యూ సిబ్బందిపై దాడికి దిగాడు. వీడియో తీస్తున్న సిబ్బందిపై చేయి చేసుకుని, వారి నుంచి సెల్ ఫోన్ లాక్కొన్నాడు. ఆక్రమణలు తొలిగించేందుకు వచ్చిన ఎక్స్కవేటర్ ను కూడా కిరణ్ అనయాయులు తీసుకుపోయారు.
పెందుర్తి పోలీసు స్టేషన్ లో కేసు నమోదు!
ప్రభుత్వ భూమిని అక్రమించడమేకాక, అదేమిటని ప్రశ్నించి, వారిపై దాడికి పాల్పడ్డ వైసీపీ నేత కిరణ్ తో పాటు ఆయన అనచరులపై పెందుర్తి స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తమపై దాడికి నిరసనగా రెవిన్యూ సిబ్బంది పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడిని జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తీవ్రంగా పరిగణించారు. దాడికి పాల్పడిన దొడ్డి కిరణ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నగర కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హాకు లేఖ రాశారు. ఇలా అధికారం ఉందికదా.. అని విచ్చలవిడిగా బరితెగిస్తే.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నట్లు కిరణ్ పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పెందుర్తి పోలీసులు!
Must Read:-వైసీపీ అరాచక పాలన కారణంగానే ఆత్మకూరులో మత ఘర్షణలు!