తొలి వెలుగు యాంకర్ రఘును గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా, ఐడీపీఎల్ భూములు, అక్రమ రిజిస్ట్రేషన్ల కథనాలను ప్రసారం చేసే వాళ్లకు ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు చేశారు. రఘు కిడ్నాప్ వ్యవహరంపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ‘‘సీనియర్ జర్నలిస్ట్ రఘు అరెస్టును ఖండిస్తున్నాను. సమాజంలో ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా ? హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే,ఆ కబ్జా భాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు ఆయనపై కేసు పెట్టారు’’ అంటూ ట్వీట్ చేశారు.
Must Read ;- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి వివరాలు సేకరించాం : బండి సంజయ్ వ్యాఖ్యలు
సీనియర్ జర్నలిస్ట్ రఘు అరెస్టును ఖండిస్తున్నాను.సమాజంలో ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా ?
హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే,ఆ కబ్జా భాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు ఆయనపై కేసు పెట్టారు.— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 3, 2021











