YSRCP MLA Rachamallu Viral Comments :
అదేంటీ.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండి ఈ ఎమ్మెల్యే ఉరేసుకుంటారేంటి? అనుకుంటున్నారా? ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని.. ఏ స్థాయికి తగ్గ నేత ఆ స్థాయిలో దోచుకుని దాచుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా వాదనలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబు పాలనలో రూ.2వేలకే ఇసుక దొరికితే.. జగన్ జమానాలో ఇసుక కోసం రూ.10 వేలు పెట్టాల్సి వస్తోందని.. ఈ లెక్కన అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందోనంటూ సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు
ఇలాంటి క్ర మంలో జగన్ కేబినెట్ లోని చాలా మంది మంత్రులపై ఇప్పటికే అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిని కొందరు ఖండిస్తే.. మరికొందరు అసలు పట్టించుకున్న పాపానే పోలేదు. మంత్రుల స్థాయిలో అవినీతి జరుగుతుంటే.. ఇక ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ఎందుకు ఊరుకుంటారు? ఈ దిశగా వైసీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జగన్ సొంత జిల్లా కడప జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపైనా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే హోదాలో రాచమల్లు అవినీతి ఓ రేంజిని దాటిపోయిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఒక్కరు చెప్పినా పదవికి రాజీనామా
ఈ ఆరోపణలు అంతకంతకూ అధికమవుతున్న వేళ.. రాచమల్లు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్లుగా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఉరేసుంటానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాను అవినీతికి పాల్పడినట్లుగా ఒక్కరు చెప్పినా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటుగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఒక్కరు చెప్పినా అంటే.. ఠకీమని ఎవరైనా అదే మాట అంటే.. చేసిన ప్రకటన మేరకు రాచమల్లు రాజీనామా చేస్తారా? ఏంటీ? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- పరిటాల భూములను కాజేశారా?











