ఎన్నికలకు ముందు అందరికీ ముద్దులు పెట్టిన జగన్మోహన్రెడ్డి ఇవాళ అందరినీ పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలు దుర్గమ్మను సందర్శించుకోకుండా పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని చంద్రబాబు విమర్శించారు. బాధిత మహిళా రైతులను చంద్రబాబు పరామర్శించారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రానికి మంచి ఆదాయ వనరుగా మారేదని చంద్రబాబు గుర్తు చేశారు. 25 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి పునాది వేయడం వల్ల నేడు తెలంగాణకు ఐటీ ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. అమరావతిని వైసీపీ నేతలు చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఆర్థిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశామని ఆయన గుర్తు చేశారు. నేడు అన్నీ పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విధ్వంసం చేయడం తేలిక
అభివృద్ది చేయడం కష్టం, విధ్వంసం చేయడం చాలా తేలికని చంద్రబాబు అన్నారు. ప్రజావేదికను కూల్చారు. అప్పటి నుంచి కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలకు జరిగిన అన్యాయం మరచిపోయేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు. జగన్ అరాచకాలకు అడ్డుకట్టపడే రోజు ఎంతో దూరంలో లేదని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కును కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదని సీఎంపై నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును అమ్మేందుకు జగన్మోహన్రెడ్డి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తున్నాడని ఆయన తప్పు పట్టారు. సొంత బాబాయిని చంపించి జగన్మోహన్రెడ్డి నాటకాలాడుతున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి కూడా అన్యాయం చేశాడని చంద్రబాబు గుర్తు చేశారు.
Must Read ;- పోలీసు చర్యలను ఖండించకపోతే శవాలతో సమానమే.. RRR ఫైర్











