ఈ నెల పదో తేదీన జరగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ గుంటూరులో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని విజయవాడ, విశాఖ, గుంటూరు ప్రచార సభల్లో ఈ విషయం అర్థమవుతోందన్నారు. ప్రజలు ఇంకా చైతన్యవంతులు కావాలని, వైసీపీ నాయకుల రౌడీయిజం అంతం చేయాలని పిలుపు నిచ్చారు. పేకాట మంత్రి అవినీతికి ఈ ఎన్నికల ద్వారా బుద్ది చెప్పాలని ఆయన విజ్ఙప్తి చేశారు. అమరావతి రాజధాని కావాలో.. వద్దో పదో తేదీన జరగబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
గుంటూరు రోడ్ షోలో ఉద్రిక్తత
స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇవాళ టీడీపీ అధినేత గుంటూరు నగరంలో విస్తృతంగా పర్యటించారు. గుంటూరులోని యాదవ్ బజారులో చంద్రబాబునాయుడు రోడ్ షో నిర్వహస్తూ ఉండగా…. అదే సమయంలో వైకాపా కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. చంద్రబాబు రోడ్ షోకు ఎదురు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాసేపు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ కార్యకర్తలను వేరే బజారు నుంచి పంపించి వేశారు.
Must Read ;- వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే కుక్కలు, గాడిదలపైనా పన్ను: చంద్రబాబు











