దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న అమరావతి రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరును నర్సాపురం వైసీపీ ఎంపీ రఘరామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. ఒక అమ్మకు పుట్టిన మగవాళ్లు అందరూ ఈ సంఘటనలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా నిరసన తెలపాలన్నారు. దీన్ని ఖండించకపోతే శవాలతో సమానమన్నారు. మహిళలను ఉల్లి పాయల బస్తాల్లాగా పోలీసు వ్యాన్లలో విసిరేశారన్నారు. ఈ సంఘటనలపై నిరసన వ్యక్తం చేయకపోతే రాష్ట్రంలో మగవాళ్లే లేరా అనే అనుమానం కలుగుతుందన్నారు.జగన్ పాలనలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇలాంటి సంఘటనలు జరగటం దురదుష్టకరమన్నారు. మహిళలపై పోలీసుల దౌష్టికాన్ని పార్లమెంటులో కూడ ప్రస్తావించాల్సిన అంశమని, వీలుని బట్టి అక్కడ కూడ లేవనెత్తుతానికి తాను ప్రయత్నిస్తానని రఘరామ తెలిపారు.
Must Read ;- ఆకాశంలో సగం అన్నారు.. అరెస్టులు చేశారు











