ప్రేమ ఎప్పుడు.. ఎవర్ని.. ఎలా.. కలుపుతుందో ఎవరికీ తెలియదు. అలాగే ప్రేమకు కులం, మతం, ప్రాంతం.. ఇవేమీ అడ్డుకాదు. తెర పై హీరోలు ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటిస్తారు. ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ వాళ్ల రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో జరిగితే.. జరిగితే ఏంటి..? నిజంగా జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఎవరితో అంటే.. అతన్ని ఎంతగానో అభిమానించే వీరాభిమానితో కావడం విశేషం.
ఇంతకీ ఏం జరిగిందంటే… విజయ్ 1996లో పూవే ఉనక్కాగ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా యూత్ కి విపరీతంగా నచ్చేసింది. కేవలం తమిళనాడులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులందరికీ ఆ సినిమా తెగ నచ్చేసింది. పూవే ఉనక్కాగ’ సినిమా తర్వాత విజయ్ తన తదుపరి సినిమా షూటింగ్‌లో ఉండగా, ఒక అందమైన అమ్మాయి అతడిని అభినందించడానికి వచ్చింది. ఆమె శ్రీలంకకు చెందిన ఒక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. ఆమె పేరు సంగీత. వారు యు.కె.లో సెటిల్ అయ్యారు. పూవే ఉనక్కాగ మూవీలో విజయ్ నటన చూసి, ఆయనకు అభిమాని అయ్యింది. ఆమె, ఆయనను ఎలాగైనా కలుసుకోవాలి అనుకుంది.
తను అనుకున్నట్టుగానే విజయ్ ని కలుసుకొని అభినందించింది. తొలిచూపులోనే సంగీత ఆయన హృదయాన్ని దోచుకుంది. అంతే… ఆమెకు అంగీకారమైతే, ఓసారి తన ఇంటికి వస్తే, తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పాడు విజయ్.తను ఎంతగానో అభిమానించే హీరో అడిగితే ఏ అమ్మాయి కాదంటుంది. వెంటనే ఓకే అని చెప్పింది. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలుసుకుంది విజయ్ ఇంట్లోనే. ఆమెను అమ్మానాన్నలకు పరిచయం చేశాడు విజయ్. ఆమె చక్కదనం, సింప్లిసిటీ వారిని కూడా ఆకట్టుకున్నాయి. అయితే.. ఆ అమ్మాయి రానున్న రోజుల్లో తమ కోడలు అవుతుందని మాత్రం వారప్పుడు ఏమాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని తర్వాత ఓ సందర్భంలో విజయ్ తల్లి స్వయంగా తెలిపారు.
అయితే… ఆతర్వాత విజయ్ సంగీతను ప్రేమిస్తున్నాడని విజయ్ తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఓసారి మాటల సందర్భంలో విజయ్‌ను పెళ్లిచేసుకుంటావా? అని ఆయన తండ్రి సంగీతను అడిగితే… సిగ్గుల మొగ్గ అయిన సంగీత ఆనందంగా అంగీకరించింది. విజయ్ తండ్రి అప్పటికే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేరుపొందిన దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎ. చంద్రశేఖర్. 1999 ఆగస్ట్ 25న విజయ్, సంగీత దంపతులుగా మారారు. సంగీత హిందు, విజయ్ క్రిస్టియన్. ఆమె కోసం హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను పెళ్లాడాడు. ఇదీ.. విజయ్ లవ్ స్టోరీ. విజయ్, సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు.. జాసన్, దివ్య షాషా.
Must Read ;- అనిరుథ్ ప్రేమలో పడ్డ.. అందాల భామలు











