లవ్ స్టోరీ… ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తలకెత్తుకున్న సినిమా ఇది. ఈ సినిమా ఇప్పటిది కాదు, 2019లోనే మొదలైంది. 2018లోనే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు కమ్ముల. ఎప్పట్లానే తన స్టయిల్ ఇద్దరు కొత్త హీరోహీరోయిన్లను పెట్టి ఈ సినిమా తీయడానికి ఫిక్స్ అయ్యాడు. ఇందులో హీరోగా పరిచయం కావాల్సిన వ్యక్తి ఓ నిర్మాత కొడుకు. సినిమా షూటింగ్ కూడా చకచకా పూర్తయింది. కానీ కమ్ముల మనసులో ఏదో మూల అసంతృప్తి.
రోజులు గడిచిపోతున్నాయి. సినిమా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఇక లాభం లేదని కమ్ముల ఓ రోజు షూటింగ్ఆ పేశాడు. అప్పటివరకు తీసిన రష్ ను రఫ్ గా ఎడిటింగ్ చేయించాడు. రఫ్ ఆర్ఆర్ యాడ్ చేసి సినిమా చూశాడు. అతడికి అస్సలు నచ్చలేదు. ఈ విషయం నిర్మాతలకు ఎలా చెప్పాలా అని ఆలోచించాడు. చెప్పడం కంటే చూపించడం బెటరని వాళ్లకు కూడా రఫ్ కట్ చూపించాడు. ఈ సినిమాతోనే వాళ్లు నిర్మాతలుగా పరిచయం కాబోతున్నారు. డిస్ట్రిబ్యూటర్ గా చాలా పెద్ద పేరున్న నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ కు నిర్మాతలుగా ఇదే తొలి సినిమా. దీంతో కమ్ముల అభిప్రాయానికే వాళ్లు ఓటేశారు.
అంతే, ఆ మరుసటి రోజే సినిమా ఆగిపోయింది. అప్పటివరకు నటించిన కొత్త హీరోయిన్, కొత్త హీరోయిన్ ను ఇంటికి పంపించేశారు. వాళ్లు ఎవరనే విషయం ఇప్పటికీ సామాన్య జనాలకు తెలియదు. ఆ తర్వాత కమ్ముల మరోసారి స్క్రిప్ట్ పై కూర్చున్నాడు. దాదాపు నెల రోజులు గ్యాప్ తీసుకున్నాడు. మ్యూజిక్, డాన్స్ కాన్సెప్ట్ తో రాసుకున్న ఈ కథకు స్టార్ వాల్యూ ఉంటేనే వర్కవుట్ అవుతుందని నిర్ణయానికొచ్చాడు. అనుకున్నదే తడవుగా తనకు కలిసొచ్చిన సాయిపల్లవిని తీసుకున్నాడు. ఆ వెంటనే నాగచైతన్యను కలిసి, కథ వినిపించి అతడ్ని కూడా ప్రాజెక్టులోకి తీసుకొచ్చాడు
అలా నాగచైతన్య-సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా 2019 సెప్టెంబర్ లో ఈ సినిమా ఫ్రెష్ గా మొదలైంది. అప్పటివరకు తీసిన సీన్స్ అన్నీ పక్కనపెట్టేశారు. హీరోహీరోయిన్లతో సంబంధంలేని కొన్ని సీన్లను మాత్రం అట్టిపెట్టుకున్నారు. చైతూ-సాయిపల్లవి సీన్ లోకి వచ్చిన నెల రోజులకు సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు.
అప్పటికే కొంత భాగం షూట్ అవ్వడంతో 3 నెలల్లో షూట్ పూర్తిచేసి, ఫస్ట్ కాపీ రెడీ చేద్దాం అనుకున్నాడు శేఖర్ కమ్ముల. కానీ సరిగ్గా అప్పుడే కరోనా మహమ్మారి కోరలు చాచింది. షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టి, ఫస్ట్ కాపీ రెడీ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేసే టైమ్ కు సెకెండ్ వేవ్ వచ్చేసింది. అలా ఏప్రిల్ 16, 2021న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈసారి మాత్రం రిలీజ్ గ్యారెంటీ అంటున్నాడు నిర్మాత. థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు లవ్ స్టోరీ సినిమాను వెంటనే రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. ఇదీ లవ్ స్టోరీ వెనక కథ.
Must Read ;- తాతా మనవళ్ళు గా తండ్రీ కొడుకులు.. ఇంతకీ ఎవరా హీరోలు?