పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వకీల్ గా అదిరిపోయే రీతిలో కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ .. తదుపరి చిత్రాలు ‘హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీస్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. అభిమానులకు వరుస ఫీస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కోవిడ్ క్వారంటైన్ లో ఉన్న కారణంగా.. సినిమా షూటింగ్స్ కు కొన్ని రోజుల వరకూ బ్రేక్ తప్పదు.
ఇక పవర్ స్టార్ నటిస్తున్న మొట్టమొదటి జానపద చిత్రం, అందులోనూ మొదటి పాన్ ఇండియా మూవీ అయిన ‘హరిహర వీరమల్లు’ లో కథానాయికగా అందాల నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బందిపోటు అయిన హీరోని ఆరాధించే ఒక గిరిజన యువతిగా ఆమె గ్లామర్ ఒలకబోస్తుండగా.. రాకుమారి గా శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాకీ .. ఈ విషయాన్ని రివీల్ చేసింది. అలాగే.. తాను పవన్ తో నటిస్తున్నందుకు బాగా ఎక్సైట్ అవుతున్నానని కూడా చెప్పింది. మొఘలాయిల కాలంలో ‘వీరమల్లు’ అనే బందిపోటు దొంగ.. రాబిన్ హుడ్ తరహాలో పెద్దలను కొట్టి.. పేదలకు పెట్టి.. వారి పాలిట ఎలా దేవుడిగా మారాడు అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందనుండగా.. ఇందులో కోహినూర్ ‘వజ్రం’ కూడా ముఖ్య పాత్ర పోషించబోతోంది. కోవిడ్ పరిస్థితులు అదుపులోకి వచ్చాకా.. వీరమల్లు షూటింగ్ తిరిగి మొదలు కాబోతోంది. మరి రాకుమారిగా.. జాక్వెలిన్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Must Read ;- దసరా కానుకగా పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్