తమిళ దళపతి విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడా? ఔననే చిత్రవర్గాల నుంచి సమాధానం వస్తోంది. తెలుగులో విజయ్ కి మార్కెట్ అంతగా లేదు. అలా పోల్చుకున్నప్పుడు అంతోఇంతో అజిత్ మెరుగైన స్థాయిలో ఉన్నాడు. తమిళ సూపర్ స్టర్ లు రజినీ, కమల్ లకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తమిళంలో విజయ్ నటించిన సినిమా తమిళంలో మంచి విజయం సాధిస్తుంటాయిగానీ తెలుగులోకి వచ్చేటప్పటికి అంత హైప్ రావడం లేదు. ఈ కారణమో, మరే కారణమోగాని విజయ్ ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
తెలుగులో ఇప్పుడు కొందరు హీరోలు అనుసరిస్తున్న బాటనే విజయ్ ఫాలో అవుతున్నాడన్న మాట. ఒకవిధంగా ఇది మార్కెంటింగ్ స్ట్రాటజీ కూడా. ఇప్పటిదాకా విజయ్ సినిమాలు తెలుగులో అనువాదం అవుతున్నాయి. త్వరలో విజయ్ చేయబోయే సినిమాను రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దీనికి దర్శకత్వం వహించబోతున్నారన్నది సమాచారం. దీనికి దిల్ రాజు నిర్మాత అన్న టాక్ వినిపిస్తోంది.
ఆల్రెడీ వంశీ అతనికి కథను కూడా చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్ కి ఈ కథ నచ్చినట్టు చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయాల్సిన వంశీ పైడిపల్లికి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది. దాదాపు రెండేళ్లుగా వంశీ చేతిలో సినిమా ఏదీ లేదు. మహర్షి తర్వాత అతను చేయబోయే సినిమా ఇదేనన్న సమాచారం ఉంది. విజయ్ ఇలా చేస్తే అజిత్ కూడా అదే బాటను ఫాలో అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.











