అక్కినేని నాగార్జున ఎర్లియర్ గా ‘వైల్డ్ డాగ్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. అయితే సినిమా అనుకున్న రీతిలో మ్యాజిక్ చేయలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ విధంగానైనా నిర్మాతలకు లాభాలు రానుండడం నాగ్ ను ఆనందపరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం ‘బంగార్రాజు’ పై పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు.
2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ్ బంగార్రాజు గా ఊర మాస్ పాత్రను పోషించారు. ఆయన భార్య సత్యభామ గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాలోని బంగార్రాజు పాత్రతో కళ్యాణ్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు.
నిజానికి ఎప్పుడో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సింది. అయితే స్ర్కిప్ట్ నాగార్జునకి పూర్తిగా సంతృప్తినివ్వని కారణంతో .. పలు మార్పులు చేర్పులు సూచించారు. ఎట్టకేలకు దర్శకుడు స్ర్కిప్ట్ ను లాక్ చేశాడట. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని నాగార్జున భావిస్తున్నారు.
ఇటీవల ‘వైల్డ్ డాగ్’ మీడియా ఇంట్రాక్షన్లో నాగ్ మాట్లాడుతూ.. తాను చేయబోయే తదుపరి చిత్రం బంగార్రాజే నని కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళుతుందని, అంతలో దర్శకుడు స్ర్కిప్ట్ లో ఫైనల్ ఛేంజెస్ చేస్తాడని నాగార్జున చెప్పారు. బహుశా సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలున్నాయి. మరి బంగార్రాజు గా నాగ్ ఈ సారి ఎలా మెప్పిస్తారో చూడాలి.
Must Read ;- ఆన్ లైన్ క్లాసెస్ తో బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున











