మంచు వారి వారసుడు మనోజ్ కుమార్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’ అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తల్లి పేరుతో యం.యం. ఆర్ట్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు మనోజ్. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆధ్యాత్మిక కోణంలో రూపొందుతోంది. ఇందులో మనోజ్ అఘోరా గా నటిస్తున్నాడంటూ.. ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని మనోజ్ ఆ తర్వాత వివరణ ఇచ్చాడు.
ఇక అహం బ్రహ్మస్మి సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉంటుందని .. దాన్ని ఓ సీనియర్ హీరో పోషించబోతున్నాడంటూ .. కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అది బాలయ్య చేయబోతున్నాడని కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పాత్ర పై సరికొత్త్ అప్డేట్ వచ్చింది. ఆ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునే అంటున్నారు. క్లైమాక్స్ లో కనిపించే ఆ గెస్ట్ రోల్ .. సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.
గతంలో మంచు విష్ణు హీరోగా.. పి.వాసు రూపొందించిన ‘కృష్ణార్జున’ అనే సినిమాలో నాగార్జున మోడ్రన్ కృష్ణుడిగా కనిపించారు. అలాగే.. మోహన్ బాబు హీరోగా నటించిన ‘అధిపతి’ సినిమాలో నాగ్ .. డిఫెన్స్ లాయర్ గా క్లైమాక్స్ లో కనిపిస్తారు. ఇప్పుడు మంచు మనోజ్ సినిమాలో కూడా నాగార్జున అతిథి పాత్ర పోషించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.