అక్కినేని నాగార్జున బిఫోర్ లాస్ట్ ఇయర్ ‘మన్మథుడు 2’ సినిమాతో అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేశారు కానీ.. అంతగా వర్కవుట్ కాలేదు. ఆ మూవీ తర్వాత నాగ్ .. మళ్ళీ తెరమీద కనిపించలేదు. మధ్యలో లాక్ డౌన్ రావడంతో.. ఆయన లైనప్, ప్లానింగ్ అంతా అప్ సెట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు వరుస సినిమాల్ని లైన్ లో పెడుతూ.. స్పీడ్ పెంచుతున్నారు.
ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీ ని ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధం చేస్తుండగా.. తదుపరి చిత్రం బంగార్రాజును త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇది సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో నాగ్ పోషించిన తండ్రి పాత్ర బంగార్రాజు కు కొనసాగింపుగా ఈ మూవీ రూపొందనుంది.
ఇందులో అనసూయ ఒక ప్రత్యేక పాత్రలో అదరగొట్టబోతుండగా.. భూమిక నెగెటివ్ షేడ్స్ తో కూడిన వైవిధ్యమైన పాత్రను పోషించబోతోందట. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న బంగార్రాజు మూవీ.. మిగతా సినిమాలకు ఏ రేంజ్ లో పోటీ ఇస్తుందో చూడాలి.
Also Read : ‘బంగార్రాజు’కు ముహుర్తం కుదిరిందా.?