కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం సినిమాల రిలీజ్ లపై పడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాను ఈ నెల 16న విడుదల చేయాల్సి ఉండగా.. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా .. మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇంకా ఈ లిస్ట్ లోకి పలు పాన్ ఇండియా మూవీస్ , భారీ బడ్జెట్ సినిమాలు కూడా చేరుతుండడం గమనార్హం. అందులో కంగనా రనౌత్ సెన్సేషనల్ మూవీ కూడా ఒకటి.
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘తలైవి’ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.యల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ‘తలైవి’ సినిమా ఈ నెల 23న విడుదల కావాలి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్న కారణంగా.. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామంటూ.. మేకర్స్ ప్రకటించారు. అలాగే కొత్త విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఈ విషయాన్ని నిర్మాత విష్ణు ఇందూరి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సైతం తలైవి సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.
Must Read ;- బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పై అరెస్ట్ వారెంట్
#Thalaivi has always been about people first and in these times, people and their safety comes first.
Stay safe everyone!
We will be back soon!@KanganaTeam @thearvindswami #Vijay @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #HiteshThakkar @urstirumalreddy @rajatsaroraa pic.twitter.com/ZXEASgidw8— Vishnu Vardhan Induri (@vishinduri) April 9, 2021