హాట్ టీవీ యాంకర్ అనసూయ ఇటు బుల్లి తెరపైనా, అటు వెండి తెర పైనా దూసుకుపోతోంది. ఈ హాట్ బ్యూటీ దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా బాగానే గెస్ట్ రోల్స్ చేసేసింది. ప్రస్తుతం అనసూయకి అవకాశాలు వచ్చినా సరే రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేయడంతో చాలా మంది స్టార్ హీరోలు ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. కానీ టీవీలో అనసూయకి ఆల్టర్నేట్ లేకపోవడంతో పలు ప్రఖ్యాత ఆన్ లైన్ షోలు అనసూయ పాకెట్ లో ఉన్నాయి. ఐతే టీవీ షోలతో పాటు అనసూయ టీవీ సీరియల్స్ లో కూడా నటించేందుకు ప్లాన్ చేస్తుందట. ఇటీవల కొందరు దర్శక నిర్మాతలతో కూడా మాట్లాడింది అనే టాక్ వినిపిస్తోంది.
కానీ అనసూయ అడుగుతున్న రెమ్యూనరేషన్ విషయంలోనే తెలుగు టీవీ సీరియల్స్ వారు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఐతే అనసూయ తెలుగు సీరియల్స్ తో పాటు హిందీ సీరియల్స్ వారికి కూడా ఒక ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. ఇటీవల అనసూయ ని నాగిని అనే టాప్ హిందీ సీరియల్ లో నటించమని ఓ ఆఫర్ కూడా వచ్చింది అన్నారు.ఎలాగూ హిందీ సీరియల్ లో నటించడానికి అను ఆసక్తి చూపించడంతో నాగిని 5 లో అనసూయ కీలక పాత్ర పోషించబోతోంది అంటున్నారు. ఇదే గనుక జరిగితే అనసూయ కి బాలీవుడ్ లో కూడా వెల్లువలా ఆఫర్స్ రావడం ఖాయం.