చక్కనమ్మ ఏంచేసినా అందమే. ఎక్కడికి షూటింగుకు వెళ్లినా ఆమె ప్రకృతి ఆరాధనలో మునిగి తేలుతుంది. తాజాగా ఆమె బోటింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందాల భామలు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. అందులో కీర్తి సురేష్ కూడా ఒకరు. ముఖ్యంగా ఆమె ముఖారవిందం తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. కట్టుబొట్టు తో సంప్రదాయబద్దంగా కనిపిస్తుంది.
అందుకే తెలుగు ప్రజలు ఆమెను ఓన్ చేసుకున్నారు. ఆ మధ్య మిస్ ఇండియా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లినప్పుడు కూడా సందడి చేసింది. అలాగే ఈ మధ్య షూటింగ్ కోసం వెళ్లి బోటింగ్ చేసింది. ఏదేమైనా నెట్టింట్లో మాత్రం కీర్తి సురేష్ ఏం చేసినా అందరూ ఆస్వాదిస్తున్నారు.