అ, కల్కి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుని.. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా జాంబిరెడ్డి. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి జాంబిరెడ్డి ఏంటి..? టైటిల్ వెరైటీగా ఉంది.. సినిమా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ వచ్చింది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. కరోనా వైరస్ బ్యాడ్ అయితే.. దాని డాడ్ ఎవరు..? అని ట్రైలర్ అడగడం ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ప్రశాంత్ వర్మ కరోనా బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ కథకు రాయలసీమ ఫ్యాక్షన్ అండ్ హర్రర్ మిక్స్ చేసారు. దీనికి కామెడీ కూడా జోడించారు.
దీంతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది. సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. కానీ ఈ సంక్రాంతికి జాంబీలు వస్తున్నారు అంటూ సంక్రాంతికి జాంబిరెడ్డి రిలీజ్ కానుందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. అయితే.. థియేటర్ లో రిలీజ్ చేస్తారో లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారో తెలియాల్సివుంది. మొత్తానికి జాంబిరెడ్డి ట్రైలర్ ఆకట్టుకుంటుంది మరి.. సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.