200 సంవత్సరాల క్రితం కథతో ‘కౌశిక వర్మ దమయంతి’ అనే చిత్రం రూపొందుతోంది. దమయంతి అనే రచయిత్రి కౌసిక్ వర్మను వశం చేసుకోవడానికి చేసిన విశ్వ ప్రయత్నం విఫలం కావడంతో తను ఇచ్చిన శాపం ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్న కథ అని నిర్మాతలు అంటున్నారు. వియాన్ జీ అంగారిక సమర్పణలో గురు దాత క్రియేటివ్ వర్క్స్ పతాకంపై విశ్వజిత్, అర్చన సింగ్, ఊర్వశి రాయ్, రఘు దీప్ నటీ నటులుగా సుధీర్, విశ్వజిత్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలో హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ సందర్బంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “కౌశిక వర్మ దమయంతి సినిమాకు యస్. యస్ ఆత్రేయ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాట చాలా బాగుంది. ఈ సినిమాకు విశ్వజిత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చాలా కష్టపడి తీశారు.ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంటర్ అవుతున్న దర్శక, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర హీరో , నిర్మాత విశ్వజిత్ మాట్లాడుతూ..కౌశిక వర్మ దమయంతి” చిత్రం లో హేమచంద్ర పాడిన “పదరా పదరా వేటకు వెళ్దాం” పాటను అడిగిన వెంటనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్ గారికి ధన్యవాదములు.సినిమా బాగా వచ్చింది.200 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, ప్రెజెంట్ స్టోరీ లతో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ రెండు స్టోరీలను బ్యాలెన్స్ చేస్తూ, నటీ నటులు టెక్నిషియన్స్ సపోర్ట్ తో ఎంతో కష్టపడి తీయడం జరిగింది. 200 ఇయర్స్ బ్యాక్ స్టోరీని, ప్రెజెంట్ స్టోరీని తెరాకెక్కించడం అనేది చాలా కష్టం. కానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న నాలుగు పాటలు చాలా బాగుంటాయి. 200 ఇయర్స్ బ్యాక్ లో సాగే పాతకాలపు పాట కూడా చాలా బాగా వచ్చింది. నవంబరులో ఈ సినిమా విడుదల కాబోతోంది.