ఉద్యోగులను బెదిరించడం సరికాదు..
జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. బెదింపులకు దిగడం సజ్జలకు సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇటువంటి చర్యలు ఒప్పుకునే ప్రసక్తే లేదని ఖండించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ఉద్యోగులకి పీఆర్సీ ఇస్తానని నమ్మి పలికి రివర్స్ పీఆర్సీ అందజేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన అనేక రాయితీల్లో వైసీపీ కోత విధించడమే జగన్ రెడ్డి పెద్ద మనస్సుకు నిదర్శనమా? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయంలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు. లూటీ, దుబరా కట్టిపెట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్ చేశారు.











