వివక్షా? నిర్లక్ష్యమా??
మహిళలు జెంట్ టైలర్ వద్దకు తమ దుస్తువులను కుట్టించుకోవడం మానుకుని రెండు దశాబ్ధాలకు పైగా అయింది. సమాజంలో లేడీస్ టైలర్స్ సంఖ్య ఏటేటికి పెరుగుతూనే ఉంది. ఏపీలో ఎంతమంది లేడీస్ టైలర్స్ ఉన్నారో జగన్ రెడ్డి ప్రభుత్వం వద్ద అఫీషియల్ డేటా కూడా ఉంది! ఎందుకంటే ప్రతిఏటా చేదోడు పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం టైలర్లకు రూ.10 వేలు నగదు కూడా వేస్తుంటారు. అటువంటి ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని మరిచారు. ఏ సచివాలయం వద్దకు వెళ్ళిన టైలర్స్ డేటా ఉంటుంది. వాటన్నింటిని పక్కన పెట్టి ఏకంగా మహిళా కానిస్టేబుల్స్ కు యూనిఫాం కోసం జెంట్ టైలర్ తో ఉన్నతాధికారులు కొలతలు తీయించారు. అటువంటి పరిస్థితుల్లో గత్యంతరంలేక ఉన్నతాధికారులు ఆదేశాలను పాటిస్తూ.. మహిళా కానిస్టేబుళ్లు కొలతలు ఇచ్చారు. వీరంతా కావలి, ఆత్మకూరు డివిజన్లకు చెందిన కానిస్టేబుళ్లుగా తెలుస్తోంది. నెల్లూరు టౌన్ లోని ఉమేశ్ చంద్ర హాలులో సచివాలయం మహిళా కానిస్టేబుల్స్ కు యూనిఫాం కోసం ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ఈ ఘటన జరిగిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దారుణ చర్యలపై మహిళా సంఘాలు, సామాజీక కార్యకర్తలు, విపక్షాలు భగ్గు భగ్గుమటున్నాయి.
సోషల్ మీడియా వైరల్
సచివాలయం మహిళా కానిస్టేబుల్స్ కు సంబంధించి యూనిఫాం స్ట్రిచింగ్ కు జెంట్ టైలర్ తో కొలతలు తీస్తున్న సందర్బంలో కొందరూ దానిని ఫోటోలు, వీడియోలో తీశారు. ఇప్పుడు ఆ ఫోటోలే సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు పురుష టైలర్లతో కొలతలు తీయించటమేంటి? మీ ఇంట్లో ఆడవాళ్లకైతే ఇలాగే కొలతలు తీయిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన ఎస్పీ విజయరావు.. మహిళా పోలీసుల యూనిఫాం బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కు అప్పజెప్పామన్నారు. పురుషుడు కొలతలు తీస్తున్నారని తెలిసిన వెంటనే దానిని సరిదిద్దామని తెలిపారు. అయితే ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్దంగా ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలు తీశారన్నారు. మొత్తంగా నెల్లూరులో పోలీసు అనాలోచిత చర్యలు కారణంగా రాజుకున్న ఈ వివాదం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దావానలంగా మారింది. ఈ ఘటనపై టీడీపీ మహిళా నాయకులు అనిత స్పందించారు. జగన్ పాలనలో మహిళా భద్రత గాల్లో దీపంలా మారిందని ఆమె విమర్శించారు.
Must Read:-అమ్మా.. భారతమ్మా.. జగన్ గారిని ఎక్కడైన మంచి ఆసుపత్రిలో చూపించమ్మా! – అయ్యన్న











