తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు..
ఏపీ పరిశ్రమల శాఖా మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి మంచి పేరుతెచ్చుకున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ అపోలో నుంచి ఇంటికి తరలించి గౌతమ్ పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఉదయం మంత్రి మేకపాటి గౌతమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని మీడియాకు చెప్పారు చంద్రబాబు. గౌతమ్ రెడ్డి తక్కువ సమయంలోనే సమర్థుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. హుందాగా రాజకీయం చేశారు. ఆయన మరణం బాధాకరమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ని పార్థిస్తున్నాన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Must Read:-నారావారిపల్లెలో చంద్రబాబు భూమి కబ్జా!?