“తూనీగ తూనీగ” చిత్రం తర్వాత “డర్టీ హరి” చిత్రం చేయడానికి మధ్యలో దాదాపు ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి ? అన్న ప్రశ్నకు ఎం.ఎస్.రాజు పైవిధంగా బదులిచ్చారు. ఇక తాను తాజాగా రూపొందించిన “డర్టీ హరి” గురించి స్పందిస్తూ, “సాధారణంగా టైటిల్ చూసి ఇదేదో సెక్స్ చిత్రమని కొందరు పొరబడతారు. కానీ ఇది అలాంటిది కాదు. అయితే యూత్ ను అలరించేవిధంగా చాలా స్పైసీగా ఉంటుంది. ఊరి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ యువకుడి ఆలోచనా విధానం ఎంత డర్టీగా ఉందన్న అంశంతో ఈ చిత్రాన్ని మలిచాం. ఇది నాకు కమ్ బ్యాక్ చిత్రమవుతుంది. మా ఇంట్లో వాళ్లకు ఈ చిత్రాన్ని చూపించాం వాళ్లకు ఎంతగానో నచ్చింది.

అలాగే నిర్మాత బన్నీ వాసు కూడా చిత్రాన్ని చూసిన వెంటనే తమ యాప్ లో విడుదల చేసేందుకు మొగ్గు చూపారు. సినిమా పట్ల వారికున్న నమ్మకంతో బన్నీ వాసు, హై లైఫ్ సంస్థలు ఓ బ్లాంక్ చెక్ కూడా నాకు ఇచ్చాయి. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్ అనుభవాన్ని ఈ యాప్ లో ప్రేక్షకుడు చవిచూస్తాడు. నిర్మాత తన బిజినెస్ వెసులుబాటుని బట్టి ఓటీటీనా, ఏటీటీనా, లేక థియేటర్లో చిత్రాన్ని విడుదల చేయాలా అన్నది నిర్ణయించుకుంటున్నారు. వాస్తవానికి థియేటర్ తల్లి లాంటిది అయితే ఇవి పిల్లలు లాంటివి” అని వివరించారు. తదుపరి తాను చేయబోయే కొత్త చిత్రాల గురించి తెలియజేస్తూ, “రెండు కథలను సిద్ధం చేసుకున్నాను. వాటిలో ఓ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో మొదలు పెడతాను. ఆ వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తా” అని స్పష్టం చేశారు.
Must Read ;- చిరు కొత్త సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందట.. !











