వాస్తవానికి ఈ ఢిల్లీ భామ టాలీవుడ్లోకి ప్రవేశించగానే ఎంచక్కా తెలుగు నేర్చేసుకుంది. అంతేకాదు చాలాకాలం క్రితమే హైదరాబాద్ లో ఓ అందమైన ప్లాట్ తీసుకుని మరీ నివాసం ఉండటం కూడా మొదలు పెట్టింది.. అంతగా ఇక్కడి వాతావరణంతో మమేకమైన ఆమెకు తెలుగుతో పాటు తమిళ ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, రెండు పరిశ్రమలలో కలుపుకుని దాదాపు అరడజను సినిమాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం. వాటిలో మూడు, నాలుగు తెలుగు సినిమాలతో పాటు మూడు తమిళ సినిమాలను ఆమె చేస్తున్నట్లు తెలిసింది. విజయ్ సేతుపతి సరసన చేస్తున్న సినిమా అందులో ఒకటి.
సాధారణంగా హీరోయిన్లను గ్లామర్ కోణంలోనే చూస్తుంటారు. ఆ గ్లామర్ కు కాస్త అభినయం తోడైతే అలాంటి తారలు సినీరంగంలో పది కాలాల మన జాలతారు. రాశీ కూడా గ్లామర్ ప్రదర్శన తో పాటు మంచి అభినయాన్ని పలికించే ప్రయత్నం చేస్తుంటుంది. అందుకే ఇప్పుడామెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని అంటున్నారు. మరో విశేషమేంటంటే…తాజాగా దుల్కర్ సల్మాన్ సరసన ఓ హీరోయిన్ గా నటించే అవకాశం రాశీని వరించింది. దుల్కర్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు తో పాటు పలు భాషలలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దీనిని వైజయంతి సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఎంపిక చేయగా, మరో హీరోయిన్ గా రష్మిక మండన్నాను తీసుకున్నారు. అయితే రెండో హీరోయిన్ గా తాను నటించనని రష్మిక వైదొలగడంతో వెంటనే రాశీని ఎంపిక చేశారట.
Must Read ;- హైదరాబాద్ లో ఘనంగా నిహారిక చైతన్య రిసెప్షన్